Thursday, January 23, 2025

శక్తిని మీరు నాశనం చేస్తే మేము పూజిస్తాం:మోడీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని నాశనం చేయడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ& శక్తిని నాశనం చేస్తామంటూ ఇండియా కూటమి నిన్న(ఆదివారం) ముంబైలోని శివాజీ మైదానంలో ప్రకటించింది. శక్తిని నాశనం చేయడం వారి వాంఛ అయితే శక్తిని పూజించడం మా సంకల్పం అని స్పష్టం చేశారు. శివాజీ పార్కు నుంచి శక్తిని అంతం చేస్తామని వచ్చిన ప్రకటనను తాను విన్నప్పుడు బాల్ థాకరే ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని తాను బాధపడ్డానని మోడీ అన్నారు. జై భవాని, జై శివాజీ అనే మంత్రంతో ప్రతి చిన్నారి పెరిగిన శివాజీ పార్కు నుంచి శక్తిని అందం చేస్తామన్న ప్రకటన వెలువడడం పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News