Monday, January 20, 2025

దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.నిన్న బెంగళూరులో జరిగిన ఉమ్మడి విపక్షాల భేటీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నాయని, అవినీతిపరులను రక్షించడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని విమర్శించారు.

అవినీతిని అడ్డుకునే చర్యలను విపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగిందని.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు ఆ హింసలో మరణించారని చెప్పారు. తమ కార్యకర్తలను గాలికొదిలేసి అధికార పార్టీ టిఎంసితో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు జతకట్టాయని మండిపడ్డారు. ఈ పార్టీలు కుటుంబ పాలన కోసం అవినీతిని పెంచి పోషిస్తున్నాయని అన్నారు. కుటుంబ పార్టీలు యువత కోసం ఎప్పుడూ ఆలోచించలేదని, తమ కుటుంబ పాలన కాపాడుకోవడమే ఆ పార్టీల పని అని తీవ్రంగా విమర్శించారు.

Also Read: తాజ్‌మహల్‌ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కర్రలు, రాడ్లతో దాడి..(వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News