Thursday, December 19, 2024

హమాస్‌తో యుద్ధం వేళ… మోడీకి నెతన్యాహు ఫోన్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌కు యావద్భారతావని అండ : మోడీ
న్యూఢిల్లీ : హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం భీకరపోరు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు … భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. “ ఇజ్రాయెల్‌హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు యావత్ భారతావని అండగా నిలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే. దాన్ని భారత్ నిస్సందేహంగా , తీవ్రంగా ఖండిస్తుంది” అని మోడీ ఎక్స్ (ట్విటర్ ) వేదికగా వెల్లడించారు. తమ దేశం లోకి చొరబడి మారణహోమం సృష్టించిన హమాస్ మిలిటెంట్లను తుడిచి పెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్ లోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. మరోవైపు తమ భూభాగం లోకి చొరబడిన దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. తమ దేశంపై దాడి చేసి హమాస్ ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తోపాటు, ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News