Monday, December 23, 2024

వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

 

PM Modi speaks with Russia’s Vladimir Putin
చర్చలు జరపాలని పునరుద్ఘాటన 
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. చర్చలు, దౌత్యానికి అనుకూలంగా భారతదేశం దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. ఫోన్‌లో మాట్లాడిన ఇరువురు నేతలు గ్లోబల్ ఎనర్జీ, ఫుడ్ మార్కెట్‌ల స్థితిగతులపై కూడా చర్చించినట్లు ప్రధాని మోడీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. “వ్యవసాయ వస్తువులు, ఎరువులు, ఫార్మా ఉత్పత్తులలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడం ఎలా అనే దానిపై వారు పరస్పరం మాట్లాడుకున్నారు” అని ప్రకటన పేర్కొంది.
అంతర్జాతీయ ఇంధనం, ఆహార మార్కెట్ల స్థితితో సహా ప్రపంచ సమస్యలను కూడా నాయకులు చర్చించారు. రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతున్నందున, ధాన్యాలు, ఎరువులు, ఇంధనం యొక్క నమ్మకమైన సరఫరాదారుగా రష్యా కొనసాగుతుందని పుతిన్ మోడీకి తెలిపారు. “ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం శాంతి, సంభాషణ, దౌత్యం వైపే నిలబడింది. రక్తం చిందించడం ద్వారా,  అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం ద్వారా పరిష్కారం లభించదని మేము నమ్ముతున్నాము. భారతదేశం ఏదైనా పక్షాన్ని ఎంచుకుంటే, అది శాంతి వైపు , హింసను తక్షణమే అంతం చేయడం కోసం” అని మోడీ అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News