Wednesday, January 22, 2025

బైడెన్‌కు ‘వెయ్యి చంద్రుల’ కానుక

- Advertisement -
- Advertisement -

జిల్‌కు గ్రీన్ డైమండ్.. బైడెన్‌కు ‘సహస్ర చంద్రులు’
అమెరికా అధ్యక్ష దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక కానుకలు
మోడీకి బైడెన్ దంపతుల అత్మీయ విందు

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం అమెరికా అధ్యక్ష భవనంలో జో బైడెన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోడీ, ఆ దంపతుల ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జోబైడెన్‌కు ప్రధాని మోడీ ఓ ప్రత్యేక చెక్కపెట్టెను అందజేశారు. ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణ యజుర్వేదంలోపేర్కొన్న ‘దృష్టసహస్ర చంద్రో’ అని రాసి ఉన్న పత్రాన్ని అందులో ఉంచారు. అంటే వెయ్యి నిండు చంద్రులను చూసిన వ్యక్తి అని అర్థం. ఇలా వెయ్యి నిండు చంద్రులను చూడడానికి 29,530 రోజులు లేదా 80 సంవత్సరాల 8 నెలలు పడుతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా 80 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ దీనిని ఆయనకు బహూకరించారు. సహస్ర పూర్ణచంద్ర దర్శనం సందర్భంగా దశ దానాలను చేయడం ఆనవాయితీ. అందుకే అందులో వెండితో చేసిన గణేశుడి ప్రతిమ, ఓ దీపంతో పాటుగా చిన్నపాత్రల్లో బెల్లం, ధాన్యాలు,వస్త్రం, వెన్న వంటి వస్తువులను ఉంచారు.

దాంతో పాటుగా ‘ది టెన్ ప్రిన్సిపల్ ఉపనిషద్స్’ అనువాద పుస్తకాన్ని కూడా జో బైడెన్‌కు అందజేశారు. అలాగే బైడెన్ దంపతులు కూడా మోడీకి కానుకలు అందజేశారు. 20వ శతాబ్దపు ప్రారంభ కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని మోడీకి బహుమతిగా ఇచ్చారు. బైడెన్ వ్యక్తిగతంగా మోడీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటుగా జార్జి ఈస్ట్‌మన్ మొదటి కోడక్ కెమెరా పేటెంట్ ఫాసీమెయిల్ ప్రింట్,అమెరికా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా అందజేశారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోడీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి కాపీని బహుమతిగా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News