Friday, November 22, 2024

జిఎస్‌టితోనే ఇంటింటికి నీళ్లు, గ్రామాలకు రోడ్లు: నరేంద్ర మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మౌలిక సదుపాయాలు మెరుగైతే యుతవకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజెపి జాతీయ మండలి సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉద్యోగిత పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చలనశీలత వేగవంతమవుతోందని, ఆదాయాలు పెరిగినప్పుడు దారిద్య్ర విష వలయాన్ని ఛేదిస్తామని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించామని, ప్రతి ఇంటికి మంచినీరు అందించడం ఈ ప్రభుత్వం లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు. వ్యవసాయంలో అత్యాధునిక పరికరాలు మన రైతులు వాడాలని సూచించారు. జిఎస్‌టి వసూళ్లు 11 లక్షల కోట్లకు పెరిగాయని, జిఎస్‌టి పన్నుల ఆదాయం పెరగడంతో ఇంటింటికి నీళ్లు గ్రామాలకు రోడ్లు వేసే అవకాశం వచ్చిందని, పన్ను వసూళ్లు పెరుగుతున్నా కొద్దీ జీవన ప్రమాణాలు మెరుగుదలకు అవకాశం ఉంటుందన్నారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులు దేశానికి కొత్త మార్గాలు వేస్తున్నాయని, శుద్ధ ఇంధనం తయారీలో యువతకు కోట్లాది ఉద్యోగాల కల్పన జరుగుతుందని, శుద్ధ ఇంధన తయారీలో ఇథనాల తయారీలో భారత్ కొత్త అధ్యాయం సృష్టించనుందని, రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News