Sunday, January 19, 2025

దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రూ.24,470 కోట్లతో రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని మోడీ శంకుస్థపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది. దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రూ.25వేల కోట్లు కేటాయించాం. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్ గా మారతాయి” అని పేర్కొన్నారు.

ఇక, తెలంగాణలో రూ.898 కోట్లతో హైదరాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్ పేట, మలక్ పేట, మల్కాజిగిరి ఉప్పుగూడతోపాటు ఆదిలాబాద్, భద్రాచలం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్ నగర్, నిజామాబాద్, మహబూబాబాద్, రామగుండం, తాండూరు, రాయగిరి, జహీరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News