- Advertisement -
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోడీ నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోడీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.
- Advertisement -