Monday, January 20, 2025

ప్రపంచ విజయమిది..కలిసి పంచుకుందాం:మోడీ

- Advertisement -
- Advertisement -

జొహెన్సెస్‌బర్గ్ : భారతదేశపు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రపంచదేశాల నుంచి వెలువడుతున్న అభినందనలపై ప్రధాని మోడీ స్పందించారు. భారతదేశ ఘనమైన సైన్సు ప్రతిభాపాటవంతో ఇప్పుడు దేశం చంద్రుడి అత్యంత దుర్భేధ్య ప్రాంతానికి చేరుకుందని, దీనిపై పలు ప్రపంచదేశాల నుంచి వెలువడుతున్న సందేశాలు స్ఫూర్తిదాయకం అని బ్రిక్స్ సదస్సు నేపథ్యంలోనే ప్రధాని మోడీ తెలిపారు. చంద్రయాన్ విజయం కేవలం ఏ ఒక్కదేశానికో పరిమితం కాదని, మొత్తం మానవాళికి సంబంధించిన విస్తృత అంశం అని ప్రధాని స్పందించారు. ఇది విశ్వమంతటికి ఆనందదాయకం అన్నారు. ఈ వేదిక నుంచి తాను ప్రపంచం

తరఫున భారతీయ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియచేసే అవకాశాన్ని వినియోగించుకుంటున్నానని తెలిపారు. 24 గంటలుగా తనకు పలు స్థాయిల్లో కంగ్రాట్స్ అందుతున్నాయని, వీటి పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని వివరించారు. ఇప్పుడు దక్కిన విజయంతో ఇకముందు కూడా భారతదేశ అంతరిక్ష ప్రయోగాలు సాగుతూ ఉంటాయని చెప్పారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాన్ డెర్ లెయెన్, యుఎఇ అధ్యక్షులు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మాల్దీవుల అధ్యక్షులు ఇబ్రహీం మహ్మద్ సొలిహ్, నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని లొటయ్ షెరింగ్ ఇతర నేతలకు తాను భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ప్రధాని మోడీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News