Sunday, January 19, 2025

కెసిఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు ఆగ్రహంగా ఉన్నారు: మోడీ

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: కెసిఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు అందరూ ఆగ్రహంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని రూ.6,109కోట్ల విలువైన అభివృద్ధి పనులను వర్చ్వుల్ గా ప్రధాని మోడీ ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. “తొమ్మిదేళ్లలో కేంద్రం పంచాయతీలకు రూ.లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఎస్పిలు, ఎస్టీలు పేదలను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది. ఆదివాసి గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. ఎన్నికల ముందు కొందరు తప్పుడు వాగ్దానాలతో ముందుకొస్తున్నారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చేస్తే హైదరాబాద్ లోని కొందరికి నిద్ర పట్టదు. మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చాం.. చేసి చూపించాం. బిజెపి.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిచూపుతుంది అని పేర్కొన్నారు.

Also Read: బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 9 మంది మృతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News