Sunday, January 19, 2025

ఇంధన భద్రతలో చమురు, సహజ వాయువులు కీలక పాత్ర: మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను సృష్టించినప్పటికీ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగం అత్యంత కీలకమైన పాత్రను పోషించనుంది. ప్రస్తుత మధ్య తరగతికి చెందిన కోట్లాది మంది ప్రజల అవసరాలను అందుకోవడానికి నిరాటంకంగా చమురు మరియు సహజవాయువు సరఫరా అవసరం ఉంది అని ఇండియా ఎనర్జీ వీక్‌ (ఐఈడబ్ల్యు) 2023లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

‘‘మనం ఇంధన భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల కోణం నుంచి మాట్లాడాల్సి ఉంది. భారతదేశం లాంటి భారీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజూ 60 మిలియన్ల మంది పెట్రోల్‌ పంపులకు తమ వాహనాలలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుంటారు. ఇక్కడ రోజుకు ఐదు మిలియన్‌ క్రూడ్‌ ఆయిల్స్‌ బ్యారెల్స్‌ వినియోగం జరుగుతుంది. ఇంధన భద్రత అత్యంత కీలకం’’ అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు, గృహ, నగర వ్యవహారాల శాఖామాత్యులు హర్దీప్‌ సింగ్‌ పురి అన్నారు.

ఈ సదస్సులో ‘ధరలు మరియు సరఫరా ఒడిదుడుకులను పరిష్కరించడంలో అంతర్జాతీయ ఇంధన భద్రత ఆవశ్యకత’ అనే అంశంపై ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ హరితమ్‌ అల్‌ ఘాయిస్‌ మాట్లాడుతూ చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి రంగానికి 12 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 2045 నాటికి అవసరం అన్నారు. ఆయనే మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఈ రంగంలో పెట్టుబడులు క్షీణించడం వల్ల ఉత్పత్తి 6% తగ్గిందన్నారు. ఉద్గారాలను తగ్గించే దిశగా మనమంతా కృషి చేస్తున్న వేళ ఇంధన భద్రత కూడా కావాల్సి ఉందన్నారు.
[5:02 pm, 07/02/2023] +91 99129 97000: నూతన కేంబ్రిడ్జ్‌ బ్లెండెడ్‌ లెర్నింగ్‌ రిసోర్శెస్‌తో హైదరాబాద్‌ విద్యార్ధులు ఇప్పుడు ఐఈఎల్‌టీఎస్‌ కోసం మెరుగ్గా సిద్ధం కావొచ్చు

·

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News