Monday, December 23, 2024

రైతులకోసం ఏటా ఆరున్నర లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

రైతులకోసం ఏటా ఆరున్నర లక్షల కోట్లు
సహకార దినోత్సవంలో ప్రధాని మోడీ లెక్కలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ప్రతి ఏటా రూ 6.5 లక్షల కోట్లు ఖర్చుపెడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ సహకార సంస్థల దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని శనివారం ప్రసంగించారు. రైతుల సంక్షేమంలో సహకార వ్యవస్థ అంతర్భాగంగా నిలుస్తుందని, కో ఆపరేటివ్‌లు ఎప్పటికప్పుడు వినూత్న రీతుల్లో రైతాంగ బాగోగులకు చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. వంటనూనెల విషయంలో దేశం స్వయంసమృద్ధికి కోఆపరేటివ్‌లు తోడ్పాటు అందించాల్సి ఉందన్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగ అభ్యున్నతికి పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పిఎం కిసాన్ పథకం, కనీస మద్దతు ధరలు, ఎరువుల సబ్సిడీలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇక గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం రైతుల పంటలను సరైన ఎంఎస్‌పిలతో కొనుగోలు చేయడం ద్వారా మొత్తం మీద రూ 15 లక్షల కోట్లు వారికి చెల్లించామని తెలిపారు. గత ఏడాది ఎరువుల సబ్సిడీకి రూ.10 లక్షల కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ఈ విధంగా మొత్తం మీద ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రతి ఏటా ఆరున్నర లక్షల కోట్లను రైతులసంక్షేమానికి ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఈ విధంగా లెక్కిస్తే దేశంలోని ప్రతి రైతుకు ఏదో విధంగా సగటున ఏటా కేంద్రం నుంచి రూ 50 వేలు సాయం అందుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News