Sunday, January 19, 2025

పోఖ్రాన్ అణుపరీక్షలతో ఘనమైన ఖ్యాతి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం సాధికారతకు సాంకేతికతను వాడుకుంటుంది. అంతేకానీ ఆధిపత్యం చాటుకునేందుకు కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పోఖ్రాన్‌లో 1998 నాటి అణుపరీక్షల ఘట్టం అత్యంత కీలక విషయం అని ప్రధాని కొనియాడారు. భారతదేశ చరిత్రలో ఇది ఓ గణనీయ కాలంగా నిలుస్తుందన్నారు. అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం దేశ ప్రగతికి సరైన విధంగా వినియోగించుకుంటేనే దానికి సార్థకత దక్కుతుంది. అంతేకాని దీనిని ప్రాతిపదికగా చేసుకుని ఇతరులను బెదిరించేందుకు దిగితే అది అనుచితం అవుతుందన్నారు.

నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. పోఖ్రాన్ అణుపరీక్షల రజతోత్సవం కూడా ఇదే రోజు అయిన దశలో ప్రధాని అప్పటి అణుపరీక్షల నిర్వహణ దేశానికి గర్వకారణం అన్నారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఈ పరీక్షలు జరిగాయని, ఇది భారతదేశ సాంకేతిక శాస్త్రీయ సమర్థతను చాటింది. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట ఇనుమడించిందని తెలిపారు. అటల్‌జీ మాటల్లోనే చెప్పాలంటే ‘ మనం మన పయనాన్ని ఎప్పుడూ నిలిపివేయలేదు. మార్గమధ్యంలో తలెత్తే సవాళ్లకు తలొగ్గలేదు, వెనుదిరగలేదు’ అన్నారు.

నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోడీ లిగో ఇండియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అరుదైన భూ ఖనిజాలతో రూపొందించే శాశ్వత మాగ్నెట్లను జాతికి అంకితం చేశారు. ఒడిషాలోని జత్నిలో ఏర్పాటు అయ్యే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, పరిశోధనా కేంద్రానికి పునాదిరాయి వేశారు. ముంబైలోని టాటా స్మారక ఆసుపత్రి ప్లాటినం జూబ్లీ బ్లాక్ కూడా శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News