Monday, December 23, 2024

2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

- Advertisement -
- Advertisement -

2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
లక్ష్యాన్ని చేరుకోవడానికి టెక్నాలజీ దోహదం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..
న్యూఢిల్లీ: 2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు టెక్నాలజీ సహాయపడుతుందని ప్రధాని మోడీ మంగళవారం అన్నారు. డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చూసేందుకు రూపొందించనున్న భారీ, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల గురించి ప్రధాని వివరించారు. అన్‌లీషింగ్ ది పొటెన్షియల్. ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగ్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి కంపెనీ చేసే వ్యయం తగ్గించాలని కోరారు. చిన్న వ్యాపారాల వ్యయాన్ని తగ్గించాలనుకుంటున్నాం.

ఈ మేరకు జాబితాను రూపొందించాలన్నారు. భారతదేశం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందని, డిజిటల్ విప్లవం ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చూస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. 5జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికత వైద్యం, విద్య, వ్యవసాయం అనేక ఇతర రంగాలకు దోహదపడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సాంకేతికతను జోడించడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్‌కు ఆధారం ఏర్పడిందని, పేదలకు ప్రయోజనాలను అందించడంలో జెఎఎం యోజన, ఆధార్, మొబైల్ నంబర్) దోహదపడినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News