Sunday, December 22, 2024

‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’పై ప్రధాని మోదీ కీలక కామెంట్స్

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’, ‘ఒక దేశం-ఒకే సివిల్ కోడ్’ అమలుకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(అక్టోబర్ 31) ప్రకటించారు. గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..’ఒక దేశం-ఒకే గుర్తింపు కార్డు’, ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డ్’, ‘ఒక దేశం-ఒకే ఆరోగ్య బీమా’ విజయవంతం అయ్యాయని, ఇప్పుడు ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’, ‘ఒక దేశం-ఒక సెక్యులర్ సివిల్ కోడ్’ ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేశంలో మరింత ఐక్యత, క్రమబద్ధమైన పాలనను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.

“ఈ రోజు, ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న వన్ నేషన్ ఐడెంటిటీ-ఆధార్ విజయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకుముందు, భారతదేశంలో బహుళ పన్ను వ్యవస్థలు ఉన్నాయి, కానీ మేము వన్ నేషన్, వన్ టాక్స్ సిస్టమ్-జిఎస్‌టిని తీసుకొచ్చాం. వన్ నేషన్-వన్ పవర్ గ్రిడ్ ద్వారా దేశ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాం. వన్ నేషన్, వన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే సదుపాయాన్ని ఆయుష్మాన్ భారత్ రూపంలో అందించాము. ఇప్పుడు ఒకే దేశం-ఒకే ఎన్నికల కోసం పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, భారతదేశ వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది” అని ప్రధాని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News