Friday, November 15, 2024

భారత్ ఓ విశ్వామిత్ర ..విశ్వాసపాత్ర: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ : ప్రపంచవ్యాప్త అనిశ్చితత, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, పలు దేశాలకు ఇండియా ఇప్పుడు ప్రగతి ఛోదకం, విశ్వసనీయ స్నేహం, సుస్థిరతల పునాదిగా మారిందని పేర్కొన్నారు. వెరసి భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఏ కోణంలో చూసినా ‘విశ్వామిత్ర’ పాత్రకు చేరుకొంటోందని స్పందించారు. స్వరాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోడీ 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్ధేశించి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. పలు కిష్టతల మధ్య ప్రపంచంలో కొన్నేళ్లుగా అలుముకున్న కారుమబ్బుల నడుమ భారతదేశం కాంతిపుంజం అయిందని తెలిపారు. భారతదేశం ఆర్థిక పురోగతి రికార్డు స్థాయిలో ఉంది. ప్రధాన రేటింగ్ ఏజెన్సీలన్ని కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వీటి అంచనాల మేరకు వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశం ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద మూడు ఆర్థిక శక్తివంత దేశాలలో ఒక్కటి అవుతుందని ప్రధాని వివరించారు.

పలు దేశాధినేతలు, ప్రముఖ కంపెనీల సిఇఓలు పాల్గొనే వైబ్రెంట్ గుజరాత్ స్థానికంగా మరిన్ని పెట్టుబడులు , వ్యాపారాల ఏర్పాటుకు ఉద్ధేశించింది. అత్యంత శరవేగంగా ప్రపంచ వ్యవస్థ సుడులు తిరుగుతూ మారుతోంది. ఈ దశలో భారతదేశం తన విశిష్టతను సాధించుకుంది. విశ్వామిత్ర పేరు సార్థకం చేసుకుంది. అయితే ఇది అంత తేలిగ్గా దక్కిన గుర్తింపు కాదు. ఇందుకు మనం వారసత్వ సంపదగా ఎంచుకున్న అంకితభావం, కష్టించేతత్వం, సంక్షేమ సమిష్టిత్వం వంటివి భారత్‌కు ప్రత్యేకతలను ఆపాదించాయని వివరించారు. వీటితోనే భారత్ ఇప్పుడు గ్రోత్ ఇంజిన్ అయిందని, పలు దేశాలు ఈ విశ్వసనీయ సారధ్య పాటవాన్ని ఆదరిస్తున్నాయని ప్రధాని తెలిపారు. ప్రజా కేంద్రీకృతిక ప్రగతిని మనం పాటిస్తాం, గ్లోబల్ సౌత్‌కు గొంతుక అయ్యామని , ఇదే దశలో ప్రపంచస్థాయి ప్రగతి ఛోదక పాత్ర పోషిస్తున్నామని, దీనిని ఇన్వెస్టర్లంతా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నింటికి మించి భారతీయ యువత ప్రతిభాపాటవాలతో సాంకేతిక క్లిష్టతలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. ఈ విధంగా మన దేశం ప్రతిభాయుత యువత పవర్‌హౌస్ అయిందని మోడీ తెలిపారు . ప్రపంచస్థాయిలో సత్ఫలితాల సాధన దిశలో ఉన్న ప్రజాస్వామిక శక్తిగా మారిందని ఇది ఆద్యంతం అంతా గుర్తించాల్సిన విషయం అని ప్రధాని పేర్కొన్నారు.

ప్రగతి అంచనాల నివేదికలు చూడండి
అంతర్జాతీయ స్థాయి రేటింగ్ ఏజెన్సీలే భారతదేశం ఏదైనా సాధించగలదని చెపుతున్నాయని, ఈ విధంగా పలువురి పెట్టుబడులకు ఇదే తిరుగులేని గ్యారంటీ అవుతుందని ప్రధాని వివరించారు. త్వరలోనే భారతదేశం మూడు అతిపెద్ద ఎకనామి దేశాలలో ఒక్కటవుతుంది. ఈ గ్యారంటీని ప్రాతిపదికగా చేసుకుని ముందుకు రావాల్సి ఉందని ఇన్వెస్టర్లకు ఆయన పిలుపు నిచ్చారు. భారతదేశం ఎప్పుడూ జియో జినోదే సూత్రం పాటిస్తుందని, మన లక్షాలను నెరవేర్చుకోవడంతో పాటు ప్రపంచ స్థాయి ఉమ్మడి ఆలోచనలపై కూడా మనం దృష్టి సారించడం జరుగుతోంది. 140 కోట్ల జనాభాగల భారతదేశపు ప్రాధాన్యతాక్రమాలను, ఆలోచనలను ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకిస్తోంది. భారతదేశం ప్రజా కేంద్రీకృత ప్రగతి దిశలో సాగుతున్నందున పెట్టుబడులకు విశ్వసనీయమైన గ్యారంటీ ఉంటుందని ప్రధాని తెలియచేశారు. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ అధ్యక్షులు మెహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఇండో యుఎఐ సత్సంబంధాలలో ఇదో మరో మైలురాయి అవుతుందన్నారు. సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కూడా పాల్గొన్నారు. భారతదేశానికి అత్యంత సమర్థుడైన ప్రధానిగా మోడీ పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News