Thursday, January 23, 2025

బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు. ఆదిలాబాద్‌లో బిజెపి విజయసంకల్పం సభలో ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, అభివృద్ధి వివరించేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. నిన్న అంతా దేశాభివృద్ధిపై కేంద్రమంత్రులతో మాట్లాడానని, వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ పైనే చర్చించామని మోడీ తెలియజేశారు. ఇది ఎన్నిలక సభ కాదు అని, ఇది అభివృద్ధి ఉత్సవం అని, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ రాలేదన్నారు.

బిజెపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదివాసీలను గౌరవించుకున్నామని, ఆదివాసి బిడ్డను మన రాష్ట్రపతిగా చేసుకున్నామని, దేశంలో ఆదివాసిల కోసం కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు రూ.24 వేల కోట్ల ప్రత్యేక కార్యక్రమం చేపడుతామని హామీ ఇచ్చారు. ఆదివాసిల కోసం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని, ఆదిలాబాద్ బిడ్డలకు గత ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదని, ఆదిలాబాద్ కొమురం భీం పుట్టిన గడ్డ అని, హైదరాబాద్ మ్యూజియానికి రామ్ జీ గోండు పేరు పెట్టానని మోడీ వివరించారు. బిజెపి చేస్తున్న అభివృద్ధి కుటుంబ పార్టీలకు నచ్చదని విమర్శలు గుప్పించారు. పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి 400 సీట్లు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News