Thursday, January 23, 2025

మన రైతుల కృషి సాటిలేనిది: ప్రధాని

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అమృతకాలంలో నవయవ్వన భారతం ఆవిష్కృతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా భారతీయులు జరుపుకుంటున్నారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన యువత సొంత ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశ పెడుతోందని, ఆకాశమే హద్దుగా మన యువత అనేక రంగాల్లో సత్తా చాటుతోందన్నారు. అభివృద్ధి మహానగరాలకే కాదని, చిన్న పట్టణాలకు విస్తరిస్తోందని, చిన్న పట్టణాల్లోని యువత సాంకేతికతలో కొత్త మెరుపులు మెరిపిస్తోందని మోడీ వివరించారు.

Also Read: రైతుకు రుణ విముక్తి

పేద క్రీడాకారులు కూడా సమున్నత స్థానాలను అందుకున్నారని ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో మన రైతుల కృషి సాటిలేనిదని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచానికి ఆహారధాన్యాలు అందించే స్థాయికి మన రైతులు ఎదిగారని, భారతీయ శ్రామికవర్గం చెమటొడ్చి జాతి సంపదను పెంచుతోందని మోడీ కొనియాడారు. చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కొత్త దశాదిశను నిర్దేశిస్తున్నాయని మెచ్చుకున్నారు. భవిష్యత్‌పై భారతీయుల్లో విశ్వాసం పెరిగిందని, దీంతో భారత్ పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందని, సంపూర్ణ భారత జాతి కృషి ఫలితంగా ప్రపంచం మనవైపు చూస్తోందని మోడీ ప్రశంసించారు. కొత్త సామర్థాలను పుణికిపుచ్చుకుని భారత్ ప్రపంచంలోని తన స్థానం నిలుపుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News