Monday, December 23, 2024

అసలు సినిమా ముందుంది: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బిజెపిని గెలిపించారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 60 ఏళ్ల తరువాత పార్టీ వరసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల నిర్ణయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం విపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బిజెపి విజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుందని దుయ్యబట్టారు. ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని, విపక్షాలు నినాదాలు చేసిన అనంతరం వారు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. పెద్దల సభను ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయని, చర్చలో పాల్గొనే దమ్ములేక విపక్షం పారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.  ప్రతిపక్షాలను ప్రజలు ఓడించిన తీరు మారడంలేదని మండిపడ్డారు. తమపై జరిగిన విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని, గతంలో రిమోట్ ప్రభుత్వాన్ని నడిపారని, మా పరిపాలన పదేళ్లు ముగిశాయని, మరో 20 ఏళ్లు మిగిలి ఉందని మోడీ పేర్కొన్నారు. రాజ్యంగం మనందరికీ మార్గదర్శకం కావాలని, రాజ్యాంగం అంటే మాకు చాలా పవిత్రమైందన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థక వ్యవస్థగా భారత్ అవతరించనుందని, పదేళ్లలో జరిగింది కొంతేనని, అసలు సిన్మా ముందుందని వచ్చే ఐదేళ్లు పేదరిక నిర్మూళనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News