Tuesday, September 17, 2024

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో భారత్‌ దూసుకుపోతోంది: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో భారత్‌ దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ‘సెమీకన్‌ ఇండియా 2024’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ల ఉత్పత్తి కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌లో మరిన్ని చిప్‌లు తయారు కావాలన్నారు.

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో ప్రస్తుతం భారత్‌ 150 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకుందని.. ఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీని కారణంగా దేశంలో దాదాపు 60 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ప్రధాని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News