Thursday, September 19, 2024

సెక్యులర్ కోడ్ నేటి అవసరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సామరస్యం కీలకమని ఈ దిశలో తాము లౌకక పౌర స్మృతి అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కృతం తరువాత దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. 98 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ప్రధాని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తాము కోరుకుంటున్న ఉమ్మడి సివిల్ కోడ్ అర్థం లౌకిక ప్రాతిపదికతో కూడుకున్నదని ప్రధాని స్పష్టం చేశారు. మతాల పేరిట దేశ ప్రజలను విభజించే సివిల్ కోడ్‌కు, సంబంధిత చట్టాలకు తావు ఉండరాదని తెలిపారు. ఆధునిక సమాజంలో ఇటువంటి ధోరణులు అప్రస్తుతమవుతాయని పేర్కొన్న ప్రధాని , ప్రస్తుత సివిల్ కోడ్ అనుచితం అని తెలిపారు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి సుప్రీంకోర్టు పలు సార్లు కూలంకుషంగా విషయాలను పరిశీలించిందని, అందరి అభిప్రాయాలను తీసుకుందని చెప్పారు.

ఈ క్రమంలోనే ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైన విభజన దిశలో ఉందనే ప్రస్తావనతో , ఇది అణచివేత పక్షపాత ధోరణితో ఉందని , దేశంలోని అత్యధికుల అభిప్రాయాల మయేరకు కీలకమైన తీర్పు ఇచ్చిందన్నారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు , రాజ్యాంగ నిర్మాతల కల అన్ని చెప్పేది ఒక్కటే అని, ఈ క్రమంలోనే దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరం అని , దీనిని పరిపూర్ణం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు ముందు దేశంలో యూనిఫాం సివిల్‌కోడ్‌ను బిజెపి పదేపదే ప్రస్తావించింది. కాగా ఇప్పుడు ప్రధాని మోడీ ఈ పౌరచట్టానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. తాము కోరుకునేది సార్వత్రిక లౌకిక సివిల్ కోడ్ అని తేల్చిచెప్పారు, ఈ దిశలో పలు బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ వినూత్న సివిల్ కోడ్‌ను అమలులోకి తీసుకువచ్చాయని వివరించారు. అయినప్పటికీ దీనిపై మరింత విస్తృత చర్యలు అవసరం , అన్ని స్థాయిల్లో దీనిపై సమగ్ర అధ్యయనం మంచిదే అవుతుందన్నారు. మత ప్రాతిపదికన అమలులో ఉండే చట్టాలు త్యజించాల్సి ఉందని, వినూత్న రీతిలో నూతన లౌకిక చట్టాన్ని ఈ సెక్యులర్ సివిల్ కోడ్‌గా తీసుకురావల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఇప్పటి కాలం వివక్షతలకు తావులేని ఇటువంటి సివిల్ కోడ్‌ను ఆచరించడం అన్నారు. తమ ప్రస్తుత హయాంలో ఈ వివాదాస్పద విషయంపై దేశవ్యాప్తంగా ఆమోదయోగ్య పరిష్కారానికి పాటుపడుతామని ప్రధాని తెలిపారు.

బంగ్లా బాగుకు భారత్ ఆరాటం
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనతో ఉన్నారు. అక్కడి మైనార్టీల భద్రతను కోరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కృతం తరువాత దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. 98 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో ప్రధాని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. దేశంలో జమిలి ఎన్నికల అవసరం ఉందన్నారు. మనకు అందరిని ఆందోళనకు గురి చేసే విషయం బంగ్లాదేశ్‌లోని పరిణామం, ఇక పశ్చిమ బెంగాల్‌లో పనిచేసే చోట మహిళకు భద్రత లేని రీతిలో జరిగిన పరిణామం విచారకరం, దీనిపై మహిళలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారని తెలిపారు.

వికసిత్ భారత్ సమిష్టి కృషితో సాధ్యం
దేశం వికసిత్ భారత్ 2047 వాగ్దానం చేశామని, అయితే ఇది అందరి సమిష్టి కృషితో సాధ్యం అవుతుంది. పెట్టుబడుల సమీకరణల దిశలో రాష్ట్రాలు మరింతగా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. అప్పుడే వికసిత్ భారత్ లక్షం సంపూర్ణం అవుతుందన్నారు. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన దశను తాను గర్వకారణం అనుకుంటున్నానని. దేశానికి సువర్ణ అధ్యాయ ఆవిష్కరణ కల నెరవేరేందుకు తాను ఈ మూడోసారి మూడింతలు ఎక్కువగా పనిచేస్తానని ప్రధాని ప్రకటించారు. రాష్ట్రాలు , పౌరుల నుంచి సహకారం అత్యవసరం. దేశం యధాతథస్థితి వైఖరిని వదులుకోవల్సి ఉంది. మనం కదులుతున్నామని, ముందుకు సాగాల్సి ఉంటుందనే ఆలోచలే కీలకమని ప్రధాని చెప్పారు. పలు సంస్కరణలను ప్రజల అభ్యున్నతికి తీసుకువచ్చామని అయితే వీటిని సాకారం చేసే బాధ్యత సమిష్టి అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News