Friday, November 15, 2024

జి 20 దశలో చేయకూడనివి…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి 20 నేపథ్యంలో మంత్రివర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కీలక సూచనలు వెలువరించారు. మంత్రులు ఈ సదస్సుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అధికారిక కార్లను వాహనాలను వాడరాదు. సదస్సుకు ఏర్పాటు అయ్యే షటిల్స్‌ను వినియోగించుకోవాలి. జి 20 సదస్సు డిన్నర్ జరిగే భారత్ మండప స్థలికి మంత్రులు సిద్ధం చేసి ఉన్న షటిల్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది.

కార్లు హంగామాలు కుదరదు. ఈ నెల 9, 10 తేదీలలో జి 20 సమ్మిట్‌కు భారతదేశం సారథ్యం వహిస్తోంది. పార్లమెంట్ కాంప్లెక్స్‌కు మంత్రులు తమ వ్యక్తిగత కార్లల్లోనే రావల్సి ఉంటుంది. అధికారిక కార్లలో వస్తే ప్రోటోకాల్ సంబంధిత సమస్యలు తలెత్తి , విదేశీ అతిధులకు ఇబ్బంది కలిగే వీలుందని ప్రధాని తెలిపారు. కాంప్లెక్స్‌కు ముందు చేరుకుని , అక్కడి నుంచి వారు షటిల్ ద్వారా భారత్ మండపంలోని జి 20 వేదిక వద్దకు, ఇతరత్రా నిర్ణీత ప్రదేశాలకు వాటి ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది.

విదేశీ ప్రతినిధులు వస్తున్నందున మంత్రులు వారివారి సంస్కృతుల గురించి సరైన అవగావహన పెంచుకోవాల్సి ఉంది. వారి జీవన విధానం, వారి ఆహారం, ఆహార్యం, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలపై సరైన విధంగా పరిజ్ఞానం కల్పించుకోవాల్సి ఉంటుందని మంత్రులకు ప్రధాని సూచించారు. జి 20 సదస్సు గురించి ఏ మంత్రి పడితే ఆ మంత్రి మాట్లాడరాదని, కేవలం నిర్ధేశిత బాధ్యతలు తీసుకున్న వారే మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

జి 20 సదస్సుకు ఆహ్వానితులైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వారి వ్యక్తిగత వాహనాల్లోనే పార్లమెంట్ హౌస్ ఆవరణకు నిర్ణీత సమయంలోనే రావల్సి ఉంటుంది. జి 20 సదస్సు సంబంధిత డిన్నర్ ఈ నెల 9న సాయంత్రం 6.30 గంటలక జరుగుతుంది. దీనికి గంట ముందు సిఎంలు రావాల్సి ఉంటుంది. మంత్రులు లేదా ఆహ్వానితులకు జి 20 మొబైల్ నెట్‌వర్క్ పరిధిని కల్పిస్తారు. ఈ జి 20 మొబైల్ యాప్‌తో వివిధ భాషల నేతలు ప్రతినిధులు మాట్లాడే విషయంపై తర్జుమా మంత్రులకు అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News