Wednesday, January 22, 2025

సిసిటివి కెమెరాలతో జైలులో నాపై మోడీ నిఘా: అరింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో జూన్ 5న తాను తీహార్ జైలు నుంచి తిరిగి వస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎకైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి ఎన్నికల ప్రచారం కోసం మూడు వారాల మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కేజ్రావాల్ జూన్ 2న తిరిగి తీహార్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల చివరి దశ జూన్ 1న జరగనున్నది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్ కౌన్సిలర్లనుద్దేశించి కేజ్రీవాల్ సోమవారం ప్రసంగిస్తూ తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న తనను నైతికంగా దెబ్బతీయడానికి, అవమానించడానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. తీహార్ జైలులోని తన సెల్‌లో రెండు సిసిటివి కెమెరాలు ఉన్నాయని, వాటి ద్వారా తన కదలికలను 13 మంది అధికారులు పర్యవేక్షించారని ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సిసిటివి ఫీడ్ వెళ్లేదని, ఆయన కూడా తనను గమనించేవారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మోడీ తనపైన ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారో తనకు తెలియదని ఆయన చెప్పారు. ఆప్ నాయకులంటే ప్రజలకు గౌరవంతోపాటు అభిమానం ఉందని, మనం చేసే పనులను చూసి బిజెపి నాయకులు భయపడుతున్నారని ఆయన అన్నారు. జూన్ 2న తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, జూన్ 4న జైలులో నుంచే ఎన్నికల ఫలితాలను గమనిస్తుంటానని ఆయన చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూన్ 5న తాను జైలు నుంచి బయటకు వస్తానని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా..ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేజ్రీవాల్ తన అరెస్టు తర్వాత బిజెపి ఎన్నికల ప్రయత్నాలు చేసినప్పటికీ చీలిపోనందుకు వారిని అభినందించారు. తన అరెస్టు తర్వాత చీలిపోకుండా మరింత సంఘటితమైనందుకు ఆప్ ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News