Tuesday, April 1, 2025

క్రికెటర్లను ఓదార్చిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలై దుంఖఃసాగరంలో మునిగిపోయిన టీమిండియా క్రికెటర్లను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాని క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. అక్కడ క్రికెటర్లను ఓదార్చారు. క్రికెట్‌లో గెలుపోటములు సహాజమని, ఓటమితో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్ షమిని దగ్గరగా తీసుకుని మోడీ ఓదార్చారు.

ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. ఫైనల్లో ఓడిపోయినంత మాత్రాన ప్రపంచకప్‌లో మీ ప్రదర్శనను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఫైనల్లో ఓటమి టీమిండియా ఆటగాళ్ల ప్రపంచకప్ కల చెదిరిపోయింది. దీంతో ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన ఆటగాళ్లకు ప్రధాని ఓదార్పు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కాగా, క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన ప్రధాని మోడీకి భారత క్రికెటర్లు షమి, జడేజా తదితరులు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News