Monday, January 20, 2025

రేపిస్టు ప్రజ్వల్‌కు ప్రధాని మద్దతు

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ : మాజీ ప్రధాని దేవెగౌడ మనవ డు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై రా హుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశా రు.దాదాపు 400 మంది మహిళలపై ప్ర జ్వల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని , వారి వీడియోలు చిత్రీకరించాడని అన్నారు . అ టువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చే శారు. శివమొగ్గలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న ఆయన ప్రజ్వల్‌ను మో స్ట్ రేపిస్ట్‌గా పేర్కొన్నారు. “ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి , వారి  వీడియోలు చిత్రీకరించాడు. ఇది సెక్స్ కుంభకోణం కాదు. ఇది అతిపెద్ద అత్యాచార సంఘటన. ఓట్ల గురించి వాళ్లు (బీజేపీ కూటమి) అడుగుతున్నప్పుడు ప్రజ్వల్ ఏం చేశాడో ప్రతీ మహిళ తెలుసుకోవాలి. అతడి గురించి ప్రధానికి ముందే తెలుసు. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోడీ మద్దతు పలికారు” అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ప్రజ్వల్ ఒక మాస్ రేపిస్ట్ అని బీజేపీకి చెందిన ప్రతీఒక్క నేతకు తెలుసునని రాహుల్ ఆరోపించారు. అయినప్పటికీ అతడికి మద్దతు పలకడమే కాకుండా అతడి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అటువంటి వ్యక్తికి ప్రచారం చేసినందుకు గాను దేశంలో ప్రతీ మహిళకు ప్రధాని మోడీ , అమిత్‌షా సహా బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఎమ్‌ఎల్‌ఎ రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం అభియోగాలపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేసింది. కేసు విచారణకు హాజరు కావాలని వీరిద్దరికీ సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన దర్యాప్తు బృందం , ఆయనపై తాజాగా లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News