- Advertisement -
మాల్దీవుల వివాదంపై ఖర్గే వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విషయాలు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. కర్నాటకలోని కాలమురగిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భారత్, మాల్దీవుల మధ్య తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన పొరుగుదేశాలతో మంచి స్నేహసంబంధాలను కొనసాగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు వైఖరులను మార్చుకోరాదని, మన పొరుగుదేశాలను మార్చుకునే అవకాశం మనకు లేదని ఆయన సూచించారు.
- Advertisement -