Wednesday, January 22, 2025

ఈ తంతు మాములే ..లైట్ తీస్కోండి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ప్రధాని మోడీ బెంగళూరులో శుక్రవారం బోయింగ్ తరఫున ఏర్పాటు అయిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ క్యాంపస్(బైఎక్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. సభలో పెద్ద పెట్టున మోడీ మోడీ నినాదాలు వెల్లువెత్తాయి. దీనిని గమనించిన మోడీ వెంటనే సిఎం సిద్ధరామయ్యను ఉద్ధేశించి ‘ ముఖ్యమంత్రి జీ ఐసా హోతే రెహతా హై ’ (ముఖ్యమంత్రి గారు ..ఇటువంటివి జరుగుతూ ఉంటాయి) అని వ్యాఖ్యానించారు. తాను వేదికపై ఉండగానే మోడీ నినాదాలు వెలువడటం, తరువాత మోడీ తనకు నచ్చచెప్పడంతో సిఎం సిద్ధరామయ్య కాసింత ఇబ్బందికి గురయ్యారు. తరువాత తేరుకుని నవ్వారు. ఈ లోగా సభికుల నుంచి మోడీ నినాదాలు వెలువడుతూనే ఉన్నాయి. కోవిడ్ తరువాతి ఘట్టంలో ఇప్పుడు దేశంలో విమానాయాన సంస్థతిరిగి నిలదొక్కుకుని , పురోగమిస్తోందని ప్రధాని ఈ సభలో తెలిపారు.

ఇప్పుడున్న డిమాండ్ మేరకు మన దేశం ఇప్పటికే వందలాది విమానాలకు ఆర్డర్లు పంపించిందని పేర్కొన్నారు. ఈ విధంగా ఇండియా ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ ఏవియేషన్ మార్కెట్ అయిందని వివరించారు. ఓ విధంగా భారతదేశం ప్రపంచస్థాయి వైమానిక రంగానికి సరికొత్త ఛోదక శక్తి అవుతోందన్నారు. దేశ వైమానిక రంగంలో ఇప్పుడు మహిళల పాత్ర ఇతోధికంగా పెరిగిందని తెలిపారు. దాదాపు 15 శాతం వరకూ మహిళా పైలట్లు సేవలు అందిస్తున్నారని, ప్రపంచస్థాయిలో పరిస్థితితో బేరీజువేసుకుంటే ఇది 3 రెట్లు సగటుగా ఉందన్నారు. కేవలం వైమానిక రంగంలోనే కాకుండా అన్నింటా మహిళా కేంద్రీకృత ప్రగతి ఉంటోందన్నారు. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ అనుబంధమైన ఈ క్యాంపస్ 43 ఎకరాల స్థలంలో రూ 1600 కోట్ల వ్యయంతో నిర్మించారు. అమెరికా వెలుపల తమ సంస్థ భారీ పెట్టుబడికి దిగడం ఇదే తొలిసారి అని కంపెనీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News