Monday, December 23, 2024

కర్ణాటకలో అవినీతిపై మోడీ మౌనం వీడాలి: రాహుల్‌ గాంధీ

- Advertisement -
- Advertisement -

తీర్థహళ్లి (కర్ణాటక): ప్రధాని మోడీ కర్ణాటకలోనూ తన గురించే తప్ప ఇక దేని గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. నెలకొన్న అవినీతి సమస్యపై ఎందుకు మౌనం వహిస్తున్నారో మోడీ తెలియజేయాలన్నారు. మోడీ తన పార్టీ సిఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సిఎం యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్లను కనీసం ప్రస్తావించడం లేదన్నారు. మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడీ గురించి కాదని, కర్ణాటక ప్రజలు, వారి పిల్లలు భవిష్యత్తు గురించి ఎన్నికలు జరుగుతున్నాయనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బిజెపి నిర్వహిస్తున్న సభలకు హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ పార్టీకి చెందిన ఒక్క నేత గురించి కూడా మాట్లాడటం లేదన్నారు.

కాంగ్రెస్ సభల్లో మాజీ సిఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురించి ప్రసావిస్తానని కానీ తన పార్టీ నేతల గురించి ఎన్నడూ మాట్లాడరని శివమొగ్గ బహిరంగసభలో రాహుల్‌గాంధీ అన్నారు. కర్ణాటకలో సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకంలో భారీ అవినీతి జరిగినా జ్ఞానేంద్ర గురించి మోడీ మాట్లాడటం లేదని రాహుల్ విమర్శించారు. బిజెపి ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో జరిగిన అవినీతి గురించి మోడీ మాట్లాడాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి బిజెపి దొంగదారిలో అధికారంలోకి వచ్చిందని రాహుల్ ఆరోపించారు. యడియూరప్ప, బొమ్మై, హోంమంత్రి పేర్లు చెప్పడానికి మోడీ ఒకవేళ భయపడుతుంటే కనీసం అవినీతిని అడ్డుకునేందుకు మోడీ ఏం చేశారో చెప్పాలని, అవినీతిని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాహుల్ కోరారు.

Also Read: కాళికాదేవి అమ్మవారికి అవమానం: ఉక్రెయిన్ క్షమాపణలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News