Monday, January 20, 2025

బిజెపిపై మీరెంత బురద జల్లితే…కమలం అంతగా వికసిస్తుంది: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ విపక్షాలనుద్దేశించి, మీరు బిజెపిపై ఎంతగా బురద జల్లితే…కమలం అంతగా వికసిస్తుంది అన్నారు. ‘నేను ఈ ప్రతిపక్ష ఎంపీలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను…మీరెంత బురద(కీచడ్) జల్లితే..కమలం అంతలా వికసిస్తుంది’ అన్నారు. గత నాలుగేళ్లలో 11 కోట్ల ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం, తొమ్మిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 48 కోట్ల జనధన్ ఖాతాలు తెరిచాము’ అన్నారు. ఓ వైపు ప్రధాని మోడీ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు అదానీ, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ అదానీ కేసులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తును చేపట్టాలన్నారు. ‘ప్రభుత్వానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయడానికి భయం లేకుంటే దానిని వేయాలి, పార్లమెంటరీ కమిటీ ద్వారా దర్యాప్తు జరిపించాలి’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News