Wednesday, January 8, 2025

బిజెపి వైపు తెలంగాణ చూపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. బు ధవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీ అనంతరం ప్రధానమంత్రి తన ఎక్స్ వేదికగా ఫోటోలతో సహా ట్వీట్ చేశారు. గత బిఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయాందోళనలో ఇంకా ప్రజలు అలాగే ఉన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ప్రజలు బిజెపి పాలన కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతోందన్న మోడీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని బిజెపి నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ స్వరం గట్టిగా వినిపిస్తూనే ఉందని, తమ పార్టీ నేతలు బిజెపి అజెండాను గ ట్టిగా వివరిస్తూనే ఉంటారని ప్రధాని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News