Tuesday, September 17, 2024

వచ్చే నెలలో మోడీ అమెరికా పర్యటన

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 22వ తేదీన న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో జరిగే కమ్యూనిటీ మీట్‌లో ప్రసంగిస్తారని అధికారికంగా వెల్లడైంది. అమెరికాలో నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు ముందు భారత ప్రధాని అమెరికా పర్యటన ఖరారు అయింది. లాంగ్ ఐలాండ్‌లోని 16వేల సీట్ల సామర్థపు నసావు కొలిషియంలో సభకు ఏర్పాట్లు జరుగుతాయి. 26వ తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వప్రతినిధి సభలో కూడా పాల్గొంటారు. వక్తల జాబితాలో మోడీ పేరు కూడా చేర్చారు. ఐలాండ్‌లో జరిగే భారతీయ సంతతి సమావేశంన్యూయార్క్‌లోనే

పది సంవత్సరాల క్రితం ప్రఖ్యాత మెడిసన్ స్వేర్ గార్డెన్‌లో జరిగిన భారీస్థాయి సమావేశం తరహా అంతకు మించిన స్థాయిలో ఉంటుంది. 2014 సెప్టెంబర్‌లో మెడిసన్ స్కేర్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత 2019లో మోడీ టెక్సాస్‌లోని హుస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు, అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న ట్రంప్‌తో కలిసి మోడీ వేదిక పంచుకున్నారు. ఇప్పుడు ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ పదవికి కమలా తలపడుతున్నారు. ఇక సెప్టెంబర్ 24 నుంచి 30 వరకూ న్యూయార్క్‌లో 79వ ఐరాస జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ వ్యాప్త కీలక ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో ఐరాసలో జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News