- Advertisement -
న్యూఢిల్లీ : శిక్షక్ పర్వ్ సదస్సును ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారని ప్రధాని మంత్రి కార్యాలయం ( పిఎంఒ) వెల్లడించింది. ఈ సందర్భంగా ఇండియన్ సైన్ లాంగ్వేజి డిక్షనరీ, టాకింగ్ బుక్స్, స్కూల్ క్వాలిటీ అస్యూరెన్సు అండ్ అసెస్‌మెంట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ సిబిఎస్‌ఇ, నిష్ధా టీచర్ ట్రయినింగ్ ప్రోగ్రామ్, విద్యాంజలి పోర్టల్ లను ప్రధాని ప్రారంభిస్తారని వివరించింది. దేశం లోని పాఠశాలల్లో విద్యాబోధనలో నాణ్యత పెంపొందించడమే శిక్షక్ పర్వ్ లక్షంగా పిఎంఒ పేర్కొంది.
- Advertisement -