Thursday, September 19, 2024

మధ్యతరగతికి చేరువైన విమాన ప్రయాణం:పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

భారత పౌర విమానయాన రంగం ప్రగతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాంతీయ విమాన అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం సామాన్యులకు సైతం చేరువైందని తెలిపారు. పౌర విమానయానంపై జరుగుతున్న రెండవ ఆసియా పసిఫిక్ మంత్రిత్వస్థాయి సమావేశంలో ప్రధాని మోడీ గురువారం ప్రసంగిస్తూ దేశాభివృద్ధిలో పౌర విమానయాన రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయడంలో తోడ్పడిన ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం(ఉడాన్) కింద 1.4 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారని మోడీ తెలిపారు.

పెగురుతున్న మధ్య తరగతి ప్రజలు, వారి డిమాండు విమానయాన రండానికి చోదక శక్తులుగా ఆయన అభివర్ణించారు. ఉడాన్ కారణంగా విమాన ప్రయాణం అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. విమానయానంలో ఆధునికత కోసం కృషిచేస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలను తీసుకురానున్నదని ఆయన తెలిపారు. బుధవారం ప్రారంభమైన రెండు రోజుల సమావేశంలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన రవాణా, విమానయాన శాఖ మంత్రులు, రెగ్యులేటరీ సంస్థలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు. 29 దేశాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News