Friday, December 20, 2024

22, 23 తేదీల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటన

- Advertisement -
- Advertisement -

కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22, 23 తేదీల్లో రష్యాను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) శుక్రవారం వెల్లడించింది. ప్రధాని ఈ పర్యటనలో కజాన్‌లో బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతోను, ఆహ్వానిత నేతలతోను ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఏడాది శిఖరాగ్ర సదస్సు ప్రధాన అంశం ‘న్యాయమైన ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళ పాక్షికత్వం పటిష్ఠత’. కీలక ప్రపంచ సమస్యలపై చర్చించేందుకు అధినేతలకు అది ముఖ్యమైన వేదిక సమకూరుస్తుంది. ‘బ్రిక్స్ ప్రారంభించిన పథకాల పురోగతిని మదింపు వేసేందుకు, మరింత సహకారానికి వీలున్న రంగాలను గుర్తించేందుకు అమూల్య అవకాశాన్ని ఈ సదస్సు ఇస్తుంది’ అని ఎంఇఎ తన ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News