ముంబై: ఈ నెల 14న ఇక్కడ జరిగే గుజరాతీ దినపత్రిక ”ముంబై సమాచార్” ద్విశతాబ్ది ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారని ముంబై సమాచార్ ఎడిటర్ నీలేష్ దావె గురువారం తెలిపారు. ముంబై సమాచార్ పాఠకులు, ఉద్యోగులతో ప్రధాని భేటీ అవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను కూడా ఈ ఉత్సవానికి ఆహ్వానించినట్లు ఎడిటర్ తెలిపారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ ఉత్సవం జరుగుతుందని, ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అందులో 18వ శతాబ్దం నాటి దినపత్రిక ముద్రణా యంత్రం కూడా ప్రదర్శనకు ఉంటుందని ఆయన తెలిపారు. ముంబై సమాచార్ 200 సంవత్సరాల ప్రయాణంపై ఒక పుస్తకాన్ని, వీడియోను మోడీ ఆవిష్కరిస్తారని దావె తెలిపారు.
14న ”ముంబై సమాచార్” ద్విశతాబ్ది ఉత్సవాలలో మోడీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -