Monday, December 23, 2024

మహబూబ్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోడీ..

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలు ప్రధాని పర్యటన వివరాలను వెల్లడించారు. ఈనెల 30న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐటిఐ కళాశాల మైదానంలో ప్రధాని బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.

ప్రధాని సభ అక్టోబర్ రెండు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన ఈ నెల 30వ తేదీకి ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను బిజెపి నాయకులు చేస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ రాకతో తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించినట్లేనని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వస్తుందని బిజెపి నేతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News