Sunday, December 22, 2024

వికసిత్ భారత్‌లో రాష్ట్రాలే కీలకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2047నాటికి వికసిత్ భారత్ దేశంలోనిభారతీయు లందరి కల, ఆకాంక్ష అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపా రు.వికసిత భారత్ కేవలం నినాదప్రాయం కాదని, గ్రామీణ స్థాయి మొదలుకుని ఖరారు చేసుకునే సంపూర్ణ స్థాయి పేదరిక రహిత (జీరో పావర్టీ)తోనే సాధ్యం అవుతుందన్నారు. ప్ర భుత్వ విధాన మండలి నీతి ఆయోగ్ పాలకమండలి తొమ్మిద వ సమావేశంలో శనివారం ప్రధాని అధ్యక్షోపన్యాసం చేశారు. అత్యంత నాటకీయంగా , పది రాష్ట్రాల గైర్హాజరు , పాల్గొన్న సిఎం మమత బెనర్జీ తీవ్రస్థాయి ఆరోపణలతో వాకౌట్ చేసిన నేపథ్యంలో ప్రధాని మాట్లాడారు.ఏ స్థాయిలో కూడా కన్పించని పేదరికం సాధించడమే వికసిత్ భారత్ ప్రధాన అంతర్గత లక్షణం అవుతుందన్నారు. ఇందుకు గ్రామాలు ప్రాతిపాదిక కావల్సి ఉంటుందన్నారు. ఈ దిశలో రాష్ట్రాలదే ముఖ్య నిర్వాహక బాధ్యత అని పిలుపు నిచ్చారు. ఎప్పుడైతే గ్రామీణ ప్రాతిపదికన పేదరిక నిర్మూలన జరుగుతుందో అప్పుడే దేశంలో పరిణామాత్మకమైన నాణ్యమైన మార్పు గోచరిస్తుందన్నారు. సంపూర్ణ స్థాయి లక్షంగా వికసిత భారత్ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రం ఈ లక్ష సాధనకు పాటుపడాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రాలు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. అసాధారణమైన ఈ వికసిత లక్ష సాధన అనేది నేరుగా ప్రజలందరితోఅనుసంధానం అయి ఉంది. ప్రజలను ఈ దిశలో తీసుకువెళ్లే బాధ్యత రాష్ట్రాలన్నింటిపైనా ఉందని ప్రధాని ఈ సందర్భంగా హితవు పలికారు. అశేష సంఖ్యాక జనం ఈ లక్షంతో ముడివడి ఉన్నందున , ప్రజలతో రాష్ట్రాలు నేరుగా సంబంధాలు కలిగి ఉన్నందున లక్షం అనేది పూర్తిగా రాష్ట్రాల నిర్వహణపై ఆధారపడి ఉందన్నారు. ఇదే కీలక సమీకరణ అని తెలిపారు. ప్రధాని ప్రసంగ పాఠం ఆ తరువాత ఎక్స్ సామాజిక మాధ్యమంలో పొందుపర్చారు. ఈ దశాబ్ధం అత్యంత కీలకమైనది, సాంకేతికంగా, భౌగోళిక రాజకీయ మార్పుల క్రమంలో , దండిగా అవకాశాలు, ఇదే దశలో సవాళ్లతో కూడుకున్న దశాబ్ధం మన ముందు ఉందని తెలిపారు. అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మన దేశం పుణికిపుచ్చుకోవల్సి ఉంటుంది.

ముందుకు వచ్చే అవకాశాలను ఆసరాగా చేసుకుని మనం అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా పాలసీలను రూపొందించుకోవడం కీలకం . దీనితోనే భారతదేశం ప్రపంచ స్థాయిలో తన స్థానం నిలబెట్టుకుంటుందన్నారు. మన దేశం సుసంపన్న దేశం కావడానికి ఈ దశాబ్ధం ఓ కీలకమైన అడుగు, మైలురాయి అవుతుందన్నారు. ఇప్పుడు జరిగే నీతి ఆయోగ్ సమావేశం అత్యంతకీలకమైనది. నిర్ణీత కాలం అంటే 2047 నాటికి దేశం సంపన్నం కావడానికి అవసరం అయిన చర్చల వేదిక అవుతుందని ప్రధాని తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రాతినిధ్య చురుకైన పాలనా సౌలభ్యం, సమన్వయం అత్యవసరం , గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశలో సరైన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ జోక్యం సహేతుకం కావల్సి ఉంటుందన్నారు. ప్రణాళికల ఖరారుకు సంబంధించిన ఈ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి నీతి ఆయోగ్ భేటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు , పలువురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్‌కు ప్రధాని మోడీ ఛైర్మన్ హోదాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన 3వ జాతీయ స్థాయి చీఫ్ సెక్రెటరీల సదస్సులో వెలువరించిన సిఫార్సుల విషయంపై కూడా నీతి ఆయోగ్ దృష్టి సారించింది.

రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో భేటీ
10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల గైర్హాజరు
మోడీ అధ్యక్షతన ఇక్కడి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దీనికి పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎవరూ హాజరు కాలేదు. గైర్హాజరీ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల సిఎంలు లేదా వారి డిప్యూటీలు ఈ భేటీకి హాజరుకావల్సి ఉంది. పది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) బివిఆర్ సుబ్రమణ్యం తెలిపారు. సమావేశానికి రాకపోవడం వల్ల వారే నష్టపోతారని పేర్కొన్నారు.

ఇక బీహార్ విషయానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ సెషన్ ఉండటం వల్ల రాలేకపోయినట్లు వివరించారు. కీలక భేటీకి రాని రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రణాళికలను తెలియచేసుకునే అవకాశం కోల్పోయినట్లే అవుతుందన్నారు. ఈ పరిణామం, మమత బెనర్జీ వాకౌట్ వంటివాటిపై తామేమీ పెద్దగా చెప్పదల్చుకోలేదని సిఇఒ విశ్లేషించారు. ఇక రాష్ట్రాలు కేంద్రంతో పోటీ పడటం కంటే రాష్ట్రాలలో అభివృద్ధి దిశలో విదేశీ ప్రత్యక్ష నిధులు (ఎఫ్‌డిఐల) గురించి పోటీపడటం మంచిదని ప్రధాని ఉద్బోధించారని ఆ తరువాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ బేరీ తెలిపారు. రాష్ట్రాలలో శాంతిభద్రతలు, సుపరిపాలన , మౌలిక నిర్మాణ వ్యవస్థలు అత్యంత కీలకం అని వివరించారు. కేవలం ప్రోత్సాహకాలు, రాయితీలతో పెట్టుబడులు తరలివచ్చే ప్రసక్తే లేదన్నారు.

నీతి ఆయోగ్‌లో ప్రధాని చెప్పిన సూత్రాలు
యువతకు ఉపాధి ప్రాతిపదికన ఉండే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అవసరం . దీనితో ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య భారతీయ యువతకు ఉన్న అవకాశాలు ఇనుమడిస్తాయి
వైవిధ్యభరిత వ్యవసాయంతో పంటల దిగుబడి మరింతగా పెరిగేందుకు, నాణ్యత వృద్థికి వీలవుతుంది. భూసారం పెరిగేలా ఉండే సహజసిద్ధ ఎరువుల వాడకంతో తరాలకు భద్రత ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News