Sunday, December 22, 2024

రెండూ కీలకం

- Advertisement -
- Advertisement -
PM Modi To Chair Covid Review Meet With CMs
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కొవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదల
రెండో డోసు టీకా 70% పూర్తి
10 రోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ తరఫున హాజరైన మంత్రి హరీశ్, సిఎస్ సోమేశ్

న్యూఢిల్లీ : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుండడంతో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి స్థానికంగా అనుసరించే నియంత్రణ వ్యూహాలను రూపొందించేటప్పుడు ప్రజల జీవనోపాధికి భారీ నష్టం జరగకూడదన్నది దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకుని కరోనా కట్టడి చర్యలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీ శ్ రావు, సిఎస్ సోమేష్‌కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రులతో మోడీ మాట్లాడుతూ సామాన్య ప్రజల జీవనోపాధికి, ఆర్థికపరమైన చర్యలకు, ఎలాంటి భారీ న ష్టం కలగకుండా ఆర్థిక ఊతం కొనసాగేలా స్థానికంగా కరోనా నియంత్రణ పైనే దృష్టి కేంద్రీకరించడం మంచిదని సూచించారు.

ముందస్తు, క్రియాశీలక, సామూహిక విధానాలతో కేంద్రం, రాష్ట్రాలు సమష్టిగా వ్యవహరిస్తున్న వ్యూహాలనే కరోనాపై పోరులో కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ, నూటికి నూరు శాతం లక్షం సాధించడానికి ‘హర్ ఘర్ దస్తక్’ రీతిలో ముమ్మరం గా కొనసాగించాలని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తోందని, పదిరోజుల్లోనే 3 కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్ టీకా పూర్తి చేయడమైందని వివరించారు. త్వరితగతిని కొవిడ్ టీకా పం పిణీ చేయడం భారత్ సామర్ధాన్ని చాటుతోందని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఇప్పుడు మొదటి డోసు పొందడం గర్వకారణమని, 92 శాతం పైగా వయోజనులు మొదటి డోసు పొందగలిగారని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్ 70 శాతం పూర్తయిందని, అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్దులకు ప్రికాషన్ డోసు ఇస్తున్నామని, ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల కార్యక్రమం కొనసాగిస్తునామని చెప్పారు.

అవసరమైన వారికి టెలిమెడిసిన్ ద్వారా సేవలు అందేలా చూడాలని సూచించారు. సమష్టి ప్రయత్నాలతో 130 కోట్ల మంది భారతీయులు త్వరలో విజ యం సాధిస్తారన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఒమిక్రా న్ గురించి మొదట్లో తలెత్తిన సందేహాలు క్రమంగా ఇప్పుడు తొలగిపోతున్నాయని, ఇదివరకటి కరోనా వేరియంట్లు కన్నా ఒమిక్రాన్ అనేక రెట్లు వేగంగా విస్తరిస్తోందని, మనం అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని, అది మహమ్మారి కాకుండా చూడాలని హెచ్చరించారు. ప్రస్తుత పండగ సీజన్‌లో ప్రజల అప్రమత్తత, నిర్వహణలో ఎలాంటి లోటురాకూడదని పేర్కొన్నారు. రం నాడు ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ప్రధాని మోడీ కొవిడ్ పరిస్థితిపై సమీక్షించారు. జిల్లా స్థాయిలో తగిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News