Wednesday, January 22, 2025

వచ్చేవారం రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల మూడవ జాతీయ సమావేశం జరుగుతుందని ప్రభుత్వఉన్నతాధికారి ఒకరు శుక్రవారం చెప్పారు. డిసెంబర్ 2729 తేదీల మధ్య ఈ సమావేశం జరుగుతుందని, కేంద్రం, రాష్ట్రప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇది చెప్పుకోదగ్గ ముందడుగు అవుతుందని ఆ అధికారి తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటుగా పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన యువ జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతో పాటుగా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని ఆ అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News