Wednesday, January 22, 2025

రేపు ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం

- Advertisement -
- Advertisement -

PM Modi to dedicate NTPCs floating solar plant

వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీచే ప్రారంభం…
100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం
ఎన్టీపిసి ప్రత్యేక ఏర్పాట్లు
ఈ నెల మొదటివారంలో అందుబాటులోకి….
నీటిపై మొత్తం 4.48 లక్షల సోలార్ ప్యానళ్ల బిగింపు
నీటిపై తేలియాడనున్న పరికరాలు, యంత్రాలు

హైదరాబాద్: నీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న (ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు) ఎన్టీపిసి రామగుండం ప్రాజెక్టును నేడు (30వ తేదీన) ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రధాని ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నీటిపై తేలియాడే సోలార్ పలకలతో విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల మొదటివారంలో 100 మెగావాట్ల పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్ధానికి చేరుకుంది. ఎన్టీపిసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.483 కోట్ల వ్యయంతో ఈ సోలార్ ప్రాజెక్టును నెలకొల్పారు. బిహెచ్‌ఈఎల్ ఈ ప్లాంట్‌ను నిర్మించగా మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణం కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచేగాలులు…
నీటి అలలు, గాలులను తట్టుకునేలా ఈ సోలార్ ప్యానల్స్‌ను రూపొందించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచేగాలులు, పది మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే నీటి అలల తాకిడిని తట్టుకునేలా నీటి ఉపరితలంపై సౌరపలకలను ఏర్పాటు చేశారు. దీనికోసం నీటిపై మొత్తం 4.48 లక్షల సోలార్ ప్యానళ్లను ఉపయోగించగా, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి మొత్తం పరికరాలు, యంత్రాలు నీటిపై తేలియాడుతూ ఉండడం ఈ కేంద్రం ప్రత్యేకత.

2032 నాటికి దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్లు…
సెర్రో సిమెంట్ సాంకేతికతతో తయారుచేసిన ఫ్లాట్‌ఫాంలను రిజర్వాయర్ మధ్యలో ఏర్పాటు చేయగా వాటిపై ఈ యంత్రాలకు సంబంధించిన పరికరాలను బిగించారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాల్లోనే అతి పెద్దదిగా రామగుండం ఎన్‌టిపిసి ఇప్పటికే రికార్డు కెక్కింది. 2032 నాటికి దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ (పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి) చేయాలని ఈ సంస్థ లక్షంగా పెట్టుకుంది. అందులో భాగంగా సౌరశక్తి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసే సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి ఎన్‌టిపిసి ప్రత్యేక దృష్టి సారించింది. మొదటగా 37.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ఈ ప్లాంట్ నిర్మాణ దశలో ఉండగానే అతి పెద్ద ప్లోటింగ్ సోలార్ ప్లాంట్‌గా ఎన్‌టిపిసి ఘనత సాధించింది. మిగతా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్యానళ్ల నిర్మాణం, మిగిలిన కేబుల్ పనులు పూర్తి కావడంతో ఈ నెల మొదటివారంలో ప్లాంట్ మొత్తం 100 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకుంది.

అన్ని రకాల పరికరాలు నీటిపై తేలుతూనే….
ఎన్‌టిపిసి నిర్మిస్తున్న ఈ సోలార్ ప్లాంట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ట్రాన్స్‌ఫార్మర్స్, ఇన్వర్టర్, బ్రేకర్లతో పాటు అన్ని రకాల పరికరాలు నీటిపై తేలుతూ ఉంటాయి. ఈ 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని రిజర్వాయర్ లోపల నిర్మించడంతో దాదాపు 450 ఎకరాల భూసేకరణ అవసరం తప్పింది. దీంతోపాటు 100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఏడాదికి 1.5 లక్షల టన్నుల ఖర్చు అయ్యే బొగ్గు వినియోగం కూడా తగ్గడంతో 1.11 లక్షల టన్నుల కార్భన్‌డైయాక్సైడ్ ఉత్పత్తిని కూడా నివారించుకోవడం తగ్గిందని ఎన్‌టిపిసి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News