- Advertisement -
న్యూఢిల్లీ: లక్నోలో శుక్రవారం ప్రారంభం కానున్న రాష్ట్రాల డిజిపిల వార్షిక సమావేశంలో ఉగ్రవాద నిరోధం, సైబర్ నేరాలు, మావోయిస్టుల హింస సహా పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో పాలొటారు. కాగా హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సాయంత్రం సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఇంటెలిజన్స్ బ్యూరో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలోఅన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 250 మంది డిజిపి, ఐజిపి ర్యాంక్ అధికారులు పాల్గొంటారు. వీరంతా నేరుగా సమావేశంలో పాల్గొంటుండగా, మిగతా ఆహానితులు దేశంలోని 37 ప్రాంతాలనుంచి వర్చువల్‌గా పాల్గొంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
- Advertisement -