Saturday, January 11, 2025

ప్రధాని రోజ్‌గార్ మేళా..71000 జాబ్ లెటర్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జరిగే రోజ్‌గార్ మేళాలో దాదాపు 71,000 ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన యువకులకు ఈ నియామక పత్రాల పంపిణీ జరుగుతుంది. ఈ దశలోనే వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. పలు రాష్ట్రాలు ప్రత్యేకించి బిజెపి, మిత్రపక్ష పాలిత రాష్ట్రాలలో ఎక్కువగా ఈ రోజ్‌గార్ మేళాలను చేపట్టారు. ఈ కార్యక్రమం పరిధిలో ప్రధాని మోడీ ద్వారా ఇప్పటికే 2.9 లక్షల మందికి ఉద్యోగ పత్రాలు అందాయి. మంగళవారం నాడు అందే ఈ కొత్త నియామక పత్రాలతో ఈ సంఖ్య 3.6 లక్షలకు చేరుతుందని అధికారులు తెలిపారు.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొక అరెస్ట్

దేశవ్యాప్తంగా మంగళవారం 45 ప్రాంతాల్లోని ఉద్యోగార్థులకు ఈ నియామక పత్రాలు అందుతాయి. దేశంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ క్రమపద్ధతిలో సాగుతోందని, వివిధ కేంద్ర, రాష్ట్ర, యుటిల ప్రభుత్వ విభాగాలు ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమం విజయవంతానికి తమ పాత్ర పోషిస్తున్నాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాని మోడీ రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పెద్ద ఎత్తున ఖాళీల భర్తీ చర్యలు చేపట్టాలని, ఈ రోజ్‌గార్ మేళా పరిధిలో కనీసం 10లక్షల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ లక్షాన్ని ఖరారు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News