- Advertisement -
కత్రా నుంచి కశ్మీర్‌కు నడువనున్న వందే భారత్ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 19న జెండి ఊపి ఆరంభించనున్నారు. 272 కిమీ. ఉధంపూర్-శ్రీనగర్ -బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆ రైలు జెండా ఊపి ప్రారంభించనున్నారు. జమ్ముకత్రాశ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొలుత కత్రా నుంచే నడువనున్నది. ఎందుకంటే జమ్మ రైల్వే స్టేషన్‌లో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించగలదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రధాని మోడీ ఏప్రిల్ 19న ఉధంపూర్‌కు వస్తారు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కత్రా నుంచి వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు’ అని తెలిపారు.
- Advertisement -