దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు సోమవారం ( 16వ తేదీ) ఆరంభం కానుంది. వందేభారత్ రైళ్ల శ్రేణిలో ఇప్పుడు ఎసికోచ్‌ల వందే మెట్రోలు పట్టాలపైకి వస్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ తొలి వందే భారత్ మెట్రో రైలుకు గుజరాత్‌లోని భుజ్‌లో పచ్చజెండా చూపి ఆరంభిస్తారు. ఇది భుజ్ అహ్మదాబాద్ల మధ్య వారానికి ఆరురోజులు నడుస్తుంది. 9 స్టాప్‌లతో , పూర్తి ఎసి అన్‌రిజర్వ్‌డ్‌గా ఇది సాగుతుంది.
ఉదయం ఐదు గంటలకు భుజ్‌లో బయలుదేరే రైలు అహ్మదాబాద్ జంక్షన్‌కు ఉదయం 10.50 గంటలకు చేరుతుంది. 360 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జిని రూ 30గా ఖరారు చేశారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో 5 గంటల 45 నిమిషాలలో గమ్యం చేరుకోవచ్చునని రైల్వే పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్‌లో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ మెట్రోను పట్టాలపైకి తీసుకువస్తున్నారు. ఈ రైలులో దాదాపు 3500 మంది వరకూ కూర్చుని నిల్చుని ప్రయాణించవచ్చు.