Monday, December 23, 2024

పూరీ-హౌరా వందేభారత్ రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పూరీ-హౌరా మధ్య ఒడిశా తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉదయం 6.10 కి హౌరాలో ప్రారంభమై మధ్యాహ్నం 12.35 కి పూరీ చేరుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూరీ నుంచి మధ్యాహ్నం 1.50 కి బయలుదేరి రాత్రి 8.30 కి హౌరా చేరుకుంటుంది. 16 కోచ్‌లు ఉండే ఈ రైలు వారానికి ఆరు రోజులు ఇది నడుస్తుంది. గురువారాలు ఉండదు. ఈ రైలు పశ్చిమబెంగాల్‌కు రెండోది. దీని వల్ల ప్రయాణికులకు దాదాపు ఒక గంట సమయం ఆదా ఆవుతుంది.

పూరీహౌరా రైలుకు మొత్తం ఏడు స్టాప్‌లు ఉన్నాయి. ఖరగ్‌పూర్, బాలసోర్, భద్రక్, జాజ్‌పూర్ కియోజాస్ రోడ్, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్ స్టేషన్లలో ఇది ఆగుతుంది. ప్రతిస్టేషన్‌లో రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చైర్‌కార్ టికెట్ ధర రూ. 1590 (కేటరింగ్ రూ. 308తో కలిపి) , ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 2815 (కేటరింగ్ రూ. 369తో కలిపి) , పూరీ నగరానికి పశ్చిమబెంగాల్ పరిసరాల నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. పూరీ జగన్నాధుని క్షేత్రమే కాకుండా బీచ్ రీసార్ట్ టౌన్ కావడంతో పర్యాటకుల తాకికి ఎక్కువే. కాబట్టి ఈ రైలుకు జనాదరణ బాగా ఉంటుంది. ఈ సందర్భంగా రూ. 8000 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News