Saturday, January 11, 2025

ఆర్థిక వేత్తలతో ప్రధాని మోడీ ముందస్తు బడ్జెట్ సమావేశం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని మోడీ శుక్రవారం నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. ఆర్థిక పరిస్థితి, 7 శాతం వరకు వృద్ధి రేటు పెంపొందించడానికి తీసుకోవలసిన ప్రమాణాలపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఫిబ్రవరి1న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202324 బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. బలహీనమైన డిమాండ్‌తో దెబ్బతిన దేశ ఆర్థిక స్థితి 2023 మార్చి నాటికి నెమ్మదిగా 7 శాతం వృద్ధి రేటుకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2021-22లో జిడిపి 8.7 శాతం పెరుగుదలను పోలుస్తూ గణాంకాల మంత్రిత్వశాఖ 7 శాతం వృద్ధి రేటు పెరుగుదల అంచనాలను విడుదల చేసింది. వాస్తవానికి గత జులై సెప్టెంబర్ త్రైమాసిక సమయంలో దేశ జిడిపి సౌదీ అరేబియా వృద్ధి రేటు 8.7 శాతం కన్నా తక్కువగా 6.3 శాతానికే పరిమితం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News