Monday, January 20, 2025

13న వారణాసిలో మోడీ రోడ్‌షో

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో మెగా రోడ్‌షో నిర్వహిస్తారని, ఆ మరునాడు ఆయన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు ఒక వార్తా చానెల్‌కు తెలియజేశాయి. ఏడవ దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 7న మొదలై 1న ముగుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ యుపి చీఫ్ అజయ్ రాయ్ వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేయనున్నారు. ఆయన వారణాసి నుంచి పోటీ చేయడం మూడవ సారి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధాని మోడీపై పోటీ చేసి, ఓడిపోయారు.

అజయ్ రాయ్‌తో పాటు స్టాండప్ కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీ చేయనున్నట్లు ఈ నెల 1న ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోడీని అనుకరిస్తూ ఖ్యాతిగాంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ 479505 వోట్ల ఆధిక్యంతో వారణాసిలో అఖండ విజయంసాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీకి చెందిన శాలినీ యాదవ్‌కు195159 వోట్లు లభించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ వారణాసిలో 3.37 లక్షల వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. కేజ్రీవాల్‌కు 2 లక్షల వోట్లు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News