Monday, December 23, 2024

వివాదాల నడుమ నేడే పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (నేడు) నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. 96 సంవత్సరాల క్రితపు వృత్తాకారపు ఈ ప్రజాస్వామ్య సౌధం పలు కీలక ఘట్టాలను పదిలం చేసుకుని చరిత్ర గతిలో ఒదిగిపోతుండగా ఇప్పుడు అత్యంత అధునాతన రూపం, అంతకు మించిన సాంకేతిక సత్తాలను సంతరించుకుని కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగనుంది. ప్రజాస్వామ్యనాకి ఆలయంగా భాసించే పార్లమెంట్ నూతన భవన ఆరంభం ఇప్పుడు వివాదాస్పద అంశాల నడుమ జరుగుతోంది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగాల్సింది ప్రధానితో కాదు, దేశ రాష్ట్రపతితో అని, కనీస మర్యాదగా కూడా ఈ దిశలో ఆమెను ఆహ్వానించకపోవడం దారుణమని పేర్కొంటూ పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నాయి.

సెంగోల్ రాజదండం ప్రతిష్ట విషయం కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార బిజెపి మధ్య గత వివాదాల సుడులు రేపింది. ప్రతిపక్షాల విమర్శలు, బహిష్కరణల పిలుపులను పట్టించుకోకుండా ప్రధాని మోడీ శుక్రవారం నూతన పార్లమెంట్ భవనం సోయగాలను, హుందాతనాన్ని తెలిపే ఫోటోలతో ట్వీటు వెలువరించారు. ఇది ఓ అత్యద్భుతం అవుతుందని ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుందని స్పందించారు. కొత్త పార్లమెంట్ బాహ్య అంతర్ దృశ్యాలను ప్రజలముందుకు తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ తివాచీలు, త్రిపురకు చెందిన వెదురు అల్లికల కళాకృతులు, రాజస్థాన్ రాతిపలకల శిల్పాలు ఈ విధంగా కొత్త పార్లమెంట్ సర్వాంగసుందరమే కాకుండా భారతదేశ వైవిధ్యపు సంస్కృతికి అద్దం పడుతుందని ప్రధాని తెలిపారు. అయితే ఈ మెరుగులు మెరుపులపై మరకలాగా ఇప్పుడు కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ ఘట్టం పూర్తిగా వివాదంలో కూరుకుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News