Monday, December 23, 2024

ఈనెల 28న కొత్త పార్లమెంట్‌కు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వినూత్నంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ విషయాన్ని లోక్‌సభ సచివాలయం గురువారం ఓ అధికార ప్రకటనలో తెలిపింది. కొత్త పార్లమెంట్‌ను సెంట్రల్ విస్టా కార్యక్రమంలో భాగంగా రూపొందించారు. 888 మంది సభ్యులకు వీలుగా ఈ కొత్త సభలో ఏర్పాట్లు ఉన్నాయి.లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా గురువారం ప్రధాని మోడీని కలిసి పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చేయాలని ఆహ్వానించారు.

ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తి అయింది. 2020 డిసెంబర్‌లో నూతన పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ పునాది రాయి వేశారు. కోవిడ్, లాక్‌డౌన్ వంటి పలు చిక్కులను అధిగమించి రికార్డు స్థాయిలోనే వేగంగా నిర్మాణం, కళాత్మకత జాతీయత వారసత్వ సంపద, రాజ్యాంగ నిర్మాణఘట్టాలను తెలియచేసే విధంగా అత్యద్భుతంగా ఈ కట్టడాన్ని తీర్చిదిద్దినట్లు ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News