Monday, December 23, 2024

మహారాష్ట్రలో 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :మహారాష్ట్రలో దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరున 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ గురువారం ప్రారంభిస్తారు. మహారాష్ట్ర లోని మొత్తం 34 గ్రామీణ జిల్లాల్లో ఇవి విస్తరిస్తాయని పిఎంఒ వివరించింది.ప్రతీ కేంద్రంలో 100 మంది యువకులకు శిక్షణ ఇస్తారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి ఆధ్వర్యంలో వివిధ పారిశ్రామిక వేత్తల సహకారంతో ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News